- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ? ఉంటుందో క్లారిటీ లేదు. అయితే నేతల వైఖరితో పాటు పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్టానం జాప్యం చేస్తూ వస్తుంది. రోజుల గడిచే కొద్ది ఆశావాహుల‌ సంఖ్య కూడా పెరుగుతుంది. అనుహంగా ఎమ్మెల్సీ రేసులో కి వచ్చి పదవి దక్కించుకున్న విజయశాంతి ఇప్పుడు తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో గుప్పుమంటుంది. బీసీ కోటాలో తనకు క్యాబినెట్ అవకాసం ఇవ్వాలని విజయశాంతి కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు క్యాబినెట్ విస్తరణ వస్తున్న విజయశాంతి పేరు పరిశీలనలో కూడా లేదు. అయితే ఇప్పుడు ఆమె కూడా తనకు పదవి కావాలని కోరాటం ఆసక్తిగా మారింది.


ఇప్పటికే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇద్దరు మహిళలు మంత్రులుగా ఉన్నారు. సీతక్క , కొండా సురేఖ మంత్రులుగా కొనసాగుతున్నారు. వారిలో బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖ పదవి డేంజర్ లో ఉందన్న వార్తలు వినిపించాయి. ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత సీతక్క ఎస్టి సామాజిక‌ వర్గానికి చెందినవారు. ఒకవేళ కొండా సురేఖను తప్పిస్తే ఆ అవకాశం తనకు ఇస్తారన్న అంచనా తో విజయశాంతి మంత్రివర్గంలో చోటు కోసం లాబీయింగ్‌ ప్రారంభించారా ? అనే చర్చ కూడా తెరమీదకు వస్తుంది. పైగా ఇటీవల ప్రకటించిన కమిటీలలో ఎందులోనూ తన పేరు లేదంటే మరో దాంట్లో అవకాశం ఇస్తారేమోనని రాములమ్మ వ్యాఖ్యానించడం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: