గురువారం అహ్మదాబాద్ నుండి లండ‌న్ కు బ‌య‌లుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే అదుపు త‌ప్పి సమీపంలోని మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలింది. ఈ దుర్ఘటన యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌ను కుదిపేస్తోంది. ప్ర‌మాద స‌మ‌యంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మంది విమానంలో ఉండ‌గా.. 241 మంది మృతి చెందినట్లు అధికారులు ఇప్ప‌టికే ధృవీక‌రించారు. వైద్య కళాశాల భవనంలోని భోజనశాలపై విమానం క్రాష్ అవ్వ‌డంతో 20 మంది మెడికల్‌ స్టూడెంట్స్ కూడా మృతి చెందారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రో విమాన ప్ర‌మాదం చోటుచేసుకుంది.


జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 312 నంబర్ విమానం షికాగో నుంచి బయల్దేరి బోస్టన్‌లో ఉన్న లోగాన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. అయితే ల్యాండ్ అవుతున్న స‌మ‌యంలో జెట్‌బ్లూ విమానం రన్‌వేపై అదుపు తప్పి ప్రమాదకర స్థితిలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. చాకచక్యంగా వ్య‌వ‌హరించాడు. రన్‌వే మీద నుంచి పక్కకు జారిపోయిన‌ విమానాన్ని అదుపు చేయ‌డంతో.. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం త‌ప్పిన‌ట్లైంది. దాంతో విమానంలోని ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంట‌నే ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్ర‌యాణీకులు సేఫ్‌గా ఉన్న‌ట్లు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ వెల్ల‌డించింది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు కూడా స‌ద‌రు సంస్థ పేర్కొంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: