
ఆళ్లనాని మాజీమంత్రి .. వైసీపీ నాయకులు ప్రస్తుతం తెలుగుదేశం లో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగాను .. ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొద్ది నెలల క్రితం టీడీపీ లోకి వచ్చిన ఆళ్ల నాని ఏం చేస్తున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది. నాని టిడిపిలో చేరిన బయటకు రావటం లేదు. పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. టిడిపి తరఫున కనీసం ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయంగా టిడిపికి మధ్య ఉన్న విభేదాలు ఇప్పటికీ అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి నాని టీడీపీ చేరికను జిల్లాకు చెందిన చాలా మంది నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు ఆయనను స్వాగతించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాయకులు సర్దుకు పోతారని చంద్రబాబు అనుకున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు.
గత ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత వాళ్లని రాజకీయంగా బాగా సైలెంట్ అయ్యారు. ఆ మాటకు వస్తే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి పోయిన తర్వాత చివరి రెండు సంవత్సరాలు ఆయన పెద్దగా ప్రజల్లోకి రాలేదు. ఈ క్రమంలోని గత ఎన్నికలలో ఓటమి తర్వాత జనసేనలోకి వెళ్లాలా టిడిపిలోకి వెళ్లాలా ? అన్న తీవ్రత భర్జనల తర్వాత ఆయన తెలుగుదేశం లోకి వచ్చారు. అయితే ఇక్కడ స్థానికంగా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయినను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇష్టంతో నే నానిని పార్టీలో చేర్చుకున్నా ... లోకల్ క్యాడర్ మాత్రం నానితో కలిసి పని చేసేందుకు పెద్ద ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందుకే నాని అధికార పార్టీలో ఉన్న ఎలాంటి ప్రాధాన్యం లేని నేతగా మిగిలిపోయారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు