దేశంలో లవ్ జిహాదులు ఎక్కువైపోతున్నాయి. చాలామంది మతాలు మార్చుకొని అబద్ధాలు చెబుతూ ప్రేమల పేరుతో మోసాలు చేస్తున్నారు. దేశంలో రోజుకు ఏదో ఒక దగ్గర ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా బీహార్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక అమ్మాయిని బలవంతంగా లవ్ లోకి దింపి హిందువు అని చెప్పి చివరికి ఆమెకు గొడ్డు మాంసం తినిపించాడని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని కజేకలా ప్రాంతానికి చెందిన  27 ఏళ్ల మహిళ గోపాల్ గంజ్ కు చెందిన  మహమ్మద్ సిరాజ్ అహ్మద్ అనే వ్యక్తిని  లవ్ చేసింది.. అయితే ఆ వ్యక్తి కూడా తను ముస్లిం అని చెప్పకుండా హిందువు అని చెప్పి తన పేరు సోనుగా పరిచయం చేసుకున్నాడు. ఆయన నలంద  మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే ఆ యువతి మూడు సంవత్సరాల క్రితం చికిత్స కోసం అదే ఆసుపత్రికి వెళ్లడంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.

 ఒకరికొకరు ఫోన్ నెంబర్లు మార్చుకొని ప్రతిరోజు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పేరు మార్చుకున్న సోను ఆమెకు చాలా దగ్గరైపోయి ప్రతిరోజు కలవడం బయట తిరగడం లాంటివి చేశారు.  చివరికి ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ రూమ్ కూడా తీసుకొని అందులో ఉండడం ప్రారంభించారు. దీంతో ఇద్దరి మధ్య లవ్ పుట్టి ఒకరికొకరు చాలా దగ్గర అయిపోయారు. ఇక ఆమెను ఎప్పుడైతే శారీరకంగా ఉపయోగించుకున్నాడో అప్పటినుంచి టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఏదైనా ఫోన్లు వస్తే  ఇస్లాంలో మాట్లాడడం విన్న ఆ అమ్మాయికి చాలా అనుమానం వచ్చింది. అతను స్టడీ కి సంబంధించిన సర్టిఫికెట్లని చదవడంతోనే ఆమె షాక్ అయిపోయింది.. ఆయన పూర్తిగా ముస్లిం వ్యక్తి అని తెలిసి ఆమె చాలా ఇబ్బంది పడింది. అప్పటికే మహమ్మద్ ఆమెను అన్ని రకాలుగా ఉపయోగించుకొని ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. పలుమార్లు సబ్జీ బాగ్ కు ఆమెను తీసుకెళ్లి  గొడ్డు మాంసం కూడా తినిపించారు.

రోజుకు అయిదు సార్లు నమాజ్ చేయాలని, రోజాను పాటించాలని, ఆరు రకాల కల్మా పటించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. చివరికి ఆ వ్యక్తి ఈద్ రోజున మరో అమ్మాయిని వివాహం చేసుకొని వచ్చాడు.  మా మతంలో నాలుగు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉంది. నేను నిన్ను ఉంచుకుంటాను అంటూ ఆమెను ఇబ్బంది చేశాడు. అంతేకాదు ఆ అమ్మాయిని తన ఇంటికి కూడా తీసుకువెళ్లి కుటుంబ సభ్యుల మధ్య తీవ్రంగా హింసించారు. చివరికి బయటపడిన ఆ అమ్మాయి జూన్ 14న  మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సదరు వ్యక్తిపై అత్యాచారం,మోసం, కిడ్నాప్ 600 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను ఆ వ్యక్తి చేతిలో లవ్ జిహాద్ పేరుతో మోసపోయానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.అంతేకాదు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. తనను చంపి 25 ముక్కలుగా చేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త  వార్తల్లోకెక్కింది. దీంతో హిందూ సంఘాలన్నీ ఆమెకు అండగా నిలుస్తున్నాయి. లవ్ జిహాద్ తో చాలామంది ఇలాగే మోసం చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: