
అలాగే షియా ముస్లిం క్యాలెండర్‌లో అతి ముఖ్యమైన రోజు అయిన మొహరామును జరుపుకుంటున్న ప్రదేశంలో ఖమేనీ కనిపించారు .. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ సోషల్ మీడియాలో వదిలింది .. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు . ఖమేనీ తమ సంప్రదాయం ప్రకారం నల్లని వస్త్రాలు ధరించి అందులో కనిపించారు .. అలాగే అధిక సంఖ్యలో జన సమూహం భారీగా నినాదాలు చేస్తూ కనిపించారు .. జూన్ 14న యుద్ధం మొదలై ఆ తర్వాత సుప్రీం నాయకుడు బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి . వైమానిక దాడుల మొదటి కొన్ని రోజులోనే ఖమేనీ కనిపించకుండా పోయారు .. కానీ ఆ యుద్ధ సమయంలో రికార్డు చేసిన సందేశాలు మాత్రం విడుదల చేశారు .
ఇరాన్ , ఇజ్రాయిల్ వివాదం సమయంలో పెరుగుతున్న భద్రత సమస్యల కారణంగా ఖమేనీని ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంచారు .. ముఖ్యంగా ఆ దేశ మతపరమైన ఆచారాలను ఆచరించేందుకు ఆయన వార్షిక ప్రసంగంతో సహా ఆయన ప్రసంగాలను ముందే రికార్డు చేసి వీడియో ద్వారా విడుదల చేశారు .. అలాగే అక్కడ పెరుగుతున్న ప్రాంతీయ ఉధృతల కారణంగా భద్రతా ప్రోటోకాల్ ను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ ఆర్మీ అధికారులు చెప్పకు వస్తున్నారు. అలాగే వైమానిక దాడులు రహస్య కార్యకలాపాలుతో కూడిన ఇజ్రాయిల్ సంఘర్షణ విస్తృతమైన ప్రాంతీయ అస్థిరత గురించి ఆందోళన లేవనెత్తింది. .. అయితే ఇరాన్ పాలన ఎప్పుడూ పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తుడిని ఎదుర్కొంటూ ప్రపంచానికి తమ సత్తా చూపిస్తూనే వస్తుంది .