గడచిన కొద్ది రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం రాజా రఘువంశి , సోనమ్ హనీమూన్ మర్డర్ కేస్.. ముఖ్యంగా రాజా రఘువంశి మర్డర్ కేస్ ఒక సంచలనంగా మారింది. వివాహమైన నెలలోపే ఈ ఘటన జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కేసులో తన భార్య సోనమ్ తన ప్రియుడు రాజానే కలిసి చంపారనే విధంగా పోలీసులు కూడా తెలియజేశారు. దీంతో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే విషయం పైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఈ కేసులో లోకేంద్ర సింగ్ తోమర్, బల్వీర్ ఆశీర్వార్ కు షిల్లాంగ్ కోర్టు ఇద్దరికీ బెయిల్ ఇచ్చింది.ఇది కూడా కండిషన్లతో కూడిన బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


రాజా రఘువంశి మర్డర్ కేసులో వీరిద్దరి ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు వీరిని అరెస్టు చేయగా గత కొద్ది రోజుల నుంచి రిమాండ్ లో ఉన్న వీరిని విచారించారట అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టు వీరికి కండిషన్ బెయిల్ ని మంజూరు చేసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. తోమర్, ఆశీర్వార్ ఇద్దరూ కూడా పోలీసు విచారణకు సహకరించారని దీంతో ఇద్దరికీ హత్యతో నేరుగా ఎటువంటి సంబంధాలు లేదని లాయర్ కూడా కోర్టుకు వెల్లడించారు.



తమ డిఫెన్స్ లాయర్ వాదనలని పరిగణంలోకి తీసుకున్న తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.ఈ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇప్పుడూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఇద్దరు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతున్నది. మేఘాలయాలకు హనీమూన్ కు తీసుకువెళ్లి మరి సోనం తన భర్త రాజా రఘువంశిని చంపించింది. ఈ కేసును తప్పుదావ పట్టించడానికి చాలామంది ప్రయత్నం చేశారనే విధంగా వినిపిస్తున్నాయి. కానీ హత్య చేసిన తర్వాత మాత్రం దొరికిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: