
తెలంగాణ రాష్ట్రంలోని ఆధార్ శాశ్వత కేంద్రాలన్నీ ఇన్ హౌస్ మోడల్ విధానంలోకి మారడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. గత మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం అమలవుతుండటం గమనార్హం కొందరు ఆధార్ కేంద్రాల నిర్వాహకులు వేతనాలకు బదులు కమిషన్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా యూఐడీఏఐ ప్రతినిధుల మధ్య, ఆధార్ కేంద్రాల నిర్వాహకుల మధ్య సయోధ్య కుదిరింది.
ఇన్ హౌస్ మోడల్ కేంద్రాల పరికరాలకు డిపాజిట్లు చెల్లించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వాళ్లకు ల్యాప్ టాప్ సహా లక్షా 50 వేల రూపాయల విలువైన సామాగ్రి అందనుందని సమాచారం అందుతోంది. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాళ్లపై కఠినంగా చర్యలు ఉంటాయని ఆ కేంద్రాన్ని కొత్తవారికి అప్పగించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.
రాష్ట్రంలో మొత్తం 1151 ఆధార్ శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయగా వేర్వేరు కారణాల వల్ల 424 కేంద్రాలు మూతపడ్డాయని ప్రస్తుతం 727 కేంద్రాలు పని చేస్తున్నాయని ఈ కొత్త విధానం ద్వారా అన్ని కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఆధార్ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు