టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ రోల్స్ ద్వారా రవికిషన్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రవికిషన్ తాజాగా ఒక ప్రోగ్రాం లో మాట్లాడుతూ నా భార్య పాదాలను తాకిన తర్వాతే నిద్రపోతా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును నేను రోజూ ఇలాగే చేస్తానని అయన చెప్పుకొచ్చారు. కానీ నా భార్య అందుకు అంగీకరించాడని ఆయన పేర్కొన్నారు.

అందుకే నా భార్య నిద్రపోయిన తర్వాత పాదాలను తాకుతానని ఆయన కామెంట్లు చేశారు.  నా దగ్గర పేరు, పలుకుబడి, డబ్బు లేని సమయంలో కూడా ఆమె నా పక్కన నిలబడిందని రవికిషన్ చెప్పుకొచ్చారు.  ఆమె ఎన్నో ఒడిదుడుకులను  తట్టుకుందని ఆయన తెలిపారు. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా ఆమేనని ఆయన కామెంట్లు చేశారు.  

అంత  చేసిన ఆమెకు నేను ఏం ఇవ్వగలనని  అందుకే కనీసం పాదాలను తాకి అయినా కృతజ్ఞతులు తెలపాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.  తెలుగులో రేసుగుర్రం సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ నటుడు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కో మెట్టు ఎదిగి  బాక్సాఫీస్ వద్ద ఈ నటుడు సంచలనాలను సృష్టించారు.

రవికిషన్ ప్రస్తుతం ఎంపీగా కూడా పని చేస్తున్నారు.   సినిమాల్లో విలన్ గా పని చేసే ఈ నటుడు  రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని నెటిజన్ల నుంచి  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రవికిషన్ సక్సెస్ రేటు కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే. సినిమాల్లో ఈ నటుడు రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  రవికిషన్ కెరీర్ ప్లన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: