తరచు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కూటమి నేతల వేధింపుల వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారనే విధంగా పలు రకాల వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక టిడిపి నేత వేధింపులు భరించలేకపోతున్నానని గత మూడు రోజులుగా తనని తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు అంటూ తన వ్యక్తిగత జీవితంపై కూడా చాలా దుష్ప్రచారం చేస్తున్నారని ఒక మహిళ ఆసుపత్రి బెడ్ మీద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నది. కొంతమంది టిడిపి నేతలు వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లో ఈమె గురించి విపరీతంగా నెగటివ్ పోస్టులు పెడుతున్నారట. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు ? ఆ టిడిపి నేత ఎవరో చూద్దాం.


ఆముదాలవలస టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్.. కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్య ను గత మూడు రోజుల నుంచి తనని వేధిస్తున్నారని మీడియా ముఖంగా మాట్లాడడంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. సౌమ్యటిడిపి ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తెలియజేస్తోంది. మీటింగులు అంటూ రాత్రి 11 గంటల వరకు తనని ఇబ్బంది పెడుతున్నారని ఈ టిడిపి ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోవడం కష్టంగా మారిందంటూ తెలియజేస్తోంది.


ఎమ్మెల్యే చెప్పిందే వినాలని ఎమ్మెల్యే ను ప్రశ్నిస్తే తన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ.. తనని ట్రాన్స్ఫర్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని ఇదే విషయంపైన sc కమిషన్ ను కూడా ఫిర్యాదు చేశానంటు తెలియజేసింది ప్రిన్సిపల్ సౌమ్య. అయితే ఈ విషయం పైన అటు ఎమ్మెల్యే రవి మాత్రం ఈ ఆరోపణలను తాను ఖండిస్తున్నారని తెలియజేస్తూ ఆమె అవినీతిపరురాలు అంటూ ఆరోపణలు చేశారు. తాను విదేశాల నుంచి వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటపెడతానని తెలిపారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా లో ఈమె పైన దుష్ప్రచారం చేయిస్తున్నారని దీనివల్ల ఆమె తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నం చేసిందనే విధంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: