ఆంధ్రప్రదేశ్లో తరచూ ఈ మధ్య మహిళలు , బాలికల విషయంలో ఏవో ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అత్యాచార సంఘటనలు రోజురోజుకీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ఏపీలో తునిలో మైనర్ బాలిక విషయంపై జరిగిన ఘటన మరువకముందే ఇప్పుడు తాజాగా కోనసీమలో అలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐ.పోలవరంలో బాణాపురం గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక పైన పలుసార్లు అత్యాచారం జరిగినట్లుగా బయటపడింది.


అయితే ఆ బాలిక చదువుతున్న స్కూలు సమీపంలో ఒక భవనం ఉండగా ఆ భవనంలోకి తీసుకువెళ్లి జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ(బాబి) స్కూలు విద్యార్థిని చాక్లెట్లు ఇప్పిస్తామని చెప్పి రూముకి తీసుకువెళ్లి బట్టలు విప్పి మరి వికృత చేష్టలు చేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే స్కూల్ అయిపోయిన తర్వాత ఆ బాలిక భవనం నుంచి బయటికి వస్తూ ఉండడంతో తల్లి గమనించి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయానికి సంబంధించి బాలిక తల్లి తన బంధువులతో కలిసి జిల్లా ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం పోలీస్ స్టేషన్ అధికారులు ఆ బాలిక తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం నిందితుడి పైన పోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఆ బాలిక తల్లి మాట్లాడుతూ.. చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు గురి చేసిన వారిని చంపేయాలంటూ ఆమె మీడియా ముఖంగా ఆవేదనను తెలియజేసింది. పిఈటిగా స్కూలులో పనిచేస్తున్న బాబి ఒక రాజకీయ పార్టీలో  యాక్టివ్ గా ఉన్నారంటు అక్కడికి స్థానికులు తెలుపుతున్నారు. దీంతో రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ  పై 6A ఫోక్సో, సెక్షన్ 725 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

గడిచిన కొద్దిరోజుల క్రితం ఎనిమిదవ తరగతి బాలిక పైన 62, ఏళ్ల నారాయణ లైంగిక దాడికి  పాల్పడడంతో పోలీస్ కస్టడీలోని ఆత్మహత్య చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: