ప్రతి సారి ప్రతి క్షణం సరికొత్తగా వినూత్నమైన ఆలోచన తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ, మీలో మార్పులు తీసుకురావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇండియా హెరాల్డ్.. ప్రస్తుతం అందులో భాగంగానే మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది. అదేమిటంటే..నోరు జారిన మాట.. చేజారిన అవకాశం.. ఎగిరిపోయిన పక్షి..గడిచిపోయిన కాలం.. తిరిగి లభించడం దుర్లభం..!


దీని అర్థం ఏమిటంటే.. ఏదైనా ఒక సారి మాట్లాడిన మాట, ఒకసారి వదులుకున్న అవకాశం, చెట్టు మీద నుండి ఎగిరిపోయిన పక్షి, గడిచిన కాలం ఎన్నటికీ తిరిగి రావు అని దీని అర్థం.. ఏ విషయాన్నైనా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా మన మాటలు ఉండకూడదు. అంతేకాక మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఊరట నివ్వాలే తప్పా బాధను కలిగించకూడదు. ఎప్పుడైతే ఎదుటివాడికి మన మాటలు అమృతంలా అనిపిస్తాయో, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అవుతుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి  మాట్లాడాలి.


ఇక అవకాశాలు ఎప్పుడూ మనకు చెప్పి రావు. కాబట్టి వచ్చిన అవకాశం ఏదైనా వదులుకోకుండా జాగ్రత్తపడాలి.  వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళినప్పుడే మనం కోరుకున్న విజయాలను సాధించగలుగుతాము. కాబట్టి ఏ చిన్న అవకాశం అయినాసరే ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక పక్షి కూడా అంతే.. ఒకసారి చెట్టు మీద నుండి ఎగిరి పోయిందో తిరిగి రావడం కష్టం.


ఇక సమయం అన్నింటి కన్నా విలువైనది. ఒక్క క్షణం గడిచిపోయిన తిరిగి రావడం దుర్లభం. కాబట్టి ప్రతి క్షణం వజ్రము కన్నా విలువైనది. మనలో చాలా మంది సమయానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. ఒకసారి గడిచిపోయిన కాలం తిరిగి తీసుకురాలేము అన్న విషయం తెలిసినప్పటికీ ఎంతో సోమరులుగా మారుతున్నారు. కాబట్టి ప్రతి క్షణం విలువైనదేనని గుర్తు పెట్టుకొని మసలు కోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: