
ఈ క్రమంలోనే ఇక ఇదే విషయంపై ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో చర్చ జరుగుతుంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇదే విషయంపై చర్చిస్తూ ఇక తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు అయితే ఏదో ఒక విధంగా బీసీసీఐపై.. ఇక ఇండియాలో ఉండే పిచ్ లపై నెగెటివ్ కామెంట్లు చేస్తూ మైండ్ గేమ్స్ స్టార్ట్ చేశారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ల కామెంట్లకి టీమిండియా ప్లేయర్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కేవలం ఇరుదేశాలకు చెందిన మాజీ ప్లేయర్లు మాత్రమే కాదు ఇక మరి కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎవరు గెలుస్తారు అనే విషయంపై స్పందిస్తున్నారు.
చాలా మటుకు అయితే సొంత గడ్డపై టీమిండియాని ఓడించడం కష్టమని.. ఇక భారత జట్టే విజయం సాధిస్తుందని చెబుతున్నారు మాజీ ప్లేయర్లు. ఇలాంటి సమయంలో అటు శ్రీలంక మాజీ ప్లేయర్ మహేళ జయవర్ధనే మాత్రం టీమిండియా ఓడిపోతుంది అంటూ చెప్పాడు. ఆస్ట్రేలియా భారత్ రెండు బలమైన టీంలే. కానీ ఆస్ట్రేలియా సిరీస్ ను 2-1 తేడాతో గెలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు జయవర్తనే. ఆస్ట్రేలియా భారత్కు గట్టి పోటీ ఇస్తుందని.. కంగారుల బౌలింగ్ భారత బ్యాట్స్మెన్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలని వేచి చూస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా భారత్ పై అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు జయవర్ధనే.