
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది పేలవ ప్రదర్శన చేసింది. కానీ ఈ ఏడాది మాత్రం టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే అందరికంటే ముందే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడూ. ఇక ఒక్కొక్కరుగా జట్టులోని ఆటగాళ్లు సీఎస్కే క్యాంపులో చేరుతూ ప్రాక్టీస్ లో మునిగితేరుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే మహేంద్రసింగ్ ధోని సాధారణంగా అయితే బ్యాటింగ్ లేదా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎందుకో మహేంద్ర సింగ్ ధోని అద్భుతం చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్, కీపింగ్ మాత్రమే కాదండోయ్ ఏకంగా బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ధోని కి సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఇందులో మహేంద్ర సింగ్ ధోని స్పిన్ బౌలింగ్ చేస్తూ బంతిని గింగిరాలు తిప్పుతూ కనిపించాడు. దీన్ని బట్టి చూస్తే ఇక అటు ఐపీఎల్ సీజన్లో వికెట్ కీపింగ్ బ్యాటింగ్ మాత్రమే కాదు ధోని బౌలింగ్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.