సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో బ్యాట్స్మెన్ల ఆటతీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20 ఫార్మాట్లో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ తమ బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించిన వారు.. టెస్ట్ ఫార్మాట్ కి వచ్చేసరికి మాత్రం ఎంతో ఆచితూచి ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ బంతుల్లో తక్కువ పరుగులు చేయడం టెస్ట్ ఫార్మాట్లో చూస్తూ ఉంటాం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఉన్న కొత్త కోణాన్ని టెస్ట్ ఫార్మాట్లో చూడవచ్చు అని చెప్పాలి.


 ఇలా నెమ్మదిగా ఎంతో ఆచీతూచి ఆడుతూ భారీగా స్కోర్ చేయడానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక సిక్సర్లు ఫోర్లు కొట్టడం విషయంలో ఆటగాళ్లు టెస్ట్ ఫార్మట్ లొ రికార్డ్ సృష్టించడం అనేది చాలా అరుదుగానే జరుగుతూ ఉంటుంది. ఇక ఇటీవల శ్రీలంక బ్యాట్స్మెన్ అయిన కుషాల్ మొండిస్ ఇలాంటి అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ఐర్లాండ్, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా పసికూన పై ప్రతాపం చూపిస్తుంది శ్రీలంక జట్టు.



 ఇకపోతే ఇటీవల ఐర్లాండ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 703/3 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో 291 బంతుల్లో 11 సిక్సర్లు 18 ఫోర్ల సహాయంతో 245 పరుగులు చేశాడు  శ్రీలంక బ్యాట్స్మెన్ కుషాల్ మొండిస్. ఈ క్రమంలోనే ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన శ్రీలంక బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. గతంలో కుమార సంగకర ఒక టెస్టులో 8 శిక్షర్లు కొట్టగా.. ఇదే ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లుగా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు తన బ్యాటింగ్ విధ్వంసంతో కుషాల్ మెండిస్ ఈ రికార్డు బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: