
అయితే శనివారం నాడు ఒకే ఒక్క పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా అటు డబ్బు సమస్య ఇటు భార్యాభర్తల మధ్య వచ్చే చికాకుల సమస్య ఆరోగ్య సమస్యలు పిల్లల చదువు అన్నీ కూడా సెట్ అయిపోతాయి . ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్ని ప్రాబ్లమ్‌స్ కి ఒక్క సొల్యూషన్ అనే చెప్పాలి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి . చాలా మంది ఈ పూజా చేసిన తరువాత వాళ్లకి అన్ని ప్రాబ్లమ్‌స్ క్లీయర్ అయిపోయాయి.
శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రత్యేకమైన రోజు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి బియ్యపు పిండి దీపం అంటే చాలా చాలా ఇష్టం . ఉదయాన్నే లేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకొని పూజ గదిలోని దేవుడి పూజా సామాగ్రి పటాలు తుడుచుకొని.. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన గోవింద నామాలు చదువుతూ ..పూజ గదిని అలంకరించుకొని ..బియ్యప్పిండితో ఏడ దీపాలు చేసి ..ఆ దీపాలకు పసుపు కుంకుమ గంధముతో నామాలు దిద్ది.. భక్తిశ్రద్ధలతో పూలతో పటాలను అలంకరించి .. భక్తిశ్రద్ధలతో నిష్టగా పూజ చేస్తే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కరుణిస్తాడు . ఈ పూజని ఏడు శనివారాలు చేసి మీ మనసులోని కోరికను మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఆయనకు చెప్తే ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామీ తీరుస్తాడు . ఇలా చాలా మంది చేసి సక్సెస్ అయ్యారు . మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పూజ చేసి మీ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకోండి..!!