
శ్రావణ మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో భక్తులు వివిధ దేవతలను ఆరాధించి ఉపవాసాలు, పూజలు చేస్తారు. ముఖ్యంగా శివుడిని శ్రద్ధగా పూజించే సమయం ఇది. ఈ మాసంలో నాన్ వెజ్ తినకూడదనే నమ్మకం ముఖ్యంగా ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన కారణాలపై ఆధారపడింది.
ఆధ్యాత్మికంగా చూసినప్పుడు, శ్రావణ మాసం భక్తి, నియమం, శుద్ధతకు ప్రతీక. ఈ కాలంలో శరీరాన్ని శుద్ధంగా ఉంచాలని, సాత్విక ఆహారాన్ని అనుసరించాలని శాస్త్రాలు సూచిస్తాయి. నాన్ వెజిటేరియన్ ఆహారం తమోగుణాన్ని పెంపొందించే అవకాశం ఉన్నదని నమ్మకం. ఇది మనసును అశాంతిగా చేసి ఆధ్యాత్మిక సాధనలో ఆటంకంగా మారుతుంది.
అలాగే ఈ కాలంలో వర్షాకాలం జరుగుతుండటంతో మాంసాహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ సమయంలో శరీర రక్షణకై శాకాహారమే ఉత్తమం. అందువల్ల శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదన్న ఆచారం ప్రజల శ్రేయస్సు కోసమే ఏర్పడినది.
శ్రావణ మాసం శివునికి ప్రీతికరమైన నెల అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపవాసాలు, పూజలు, వ్రతాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని మంచి జరుగుతుందని చాలామంది బలంగా విశ్వసిస్తారు. మాంసాహారం తినకపోవడం ఆధ్యాత్మికంగా స్వచ్ఛతను సూచిస్తుందని ఎక్కువమంది నమ్ముతారు. శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని ఒక సాంప్రదాయంగా వస్తుండగా ఎక్కువమంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. వర్షాకాలంలో మాంసాహార ఉత్పత్తుల నాణ్యత కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాంసాహారం వీలైనంత వరకు తినకుండా ఉంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు