"హనుమాన్ చాలీసా" ఎంత పవర్ ఫుల్ అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. చాలామంది ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసా ను పారాయణం చేస్తూ ఉంటారు.  కొంతమంది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేస్తూ ఉంటారు.  కలియుగంలో ఆంజనేయస్వామి ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల వ్యాధులు అదేవిధంగా సమస్యలు.. దుఃఖాలు.. బాధలు నుంచి విముక్తి లభిస్తుంది అని కొంతమంది ధర్మజ్ఞులు కూడా చెబుతూ ఉన్నారు. ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయన అలా బలం ,బుద్ధి, వివేకంలో వృద్ధి పొందాలి అనుకుంటే కచ్చితంగా హనుమాన్ చాలీసా ను పారాయణం చేయాలని చాలామంది చెబుతూ ఉంటారు .


హనుమాన్ చాలీసా లోని పంక్తులను జపించడం వల్ల ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం.  మరీ ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు హనుమాన్ చాలీసా లోని ఈ పంక్తులను జపిస్తే అంతా శుభం జరుగుతుంది అంటున్నారు పండితులు . హనుమాన్ చాలీసాను చాలామంది జపిస్తూ ఉంటారు అయితే దాని అర్థం కొంతమందికి తెలియదు . అర్థం తెలియక హనుమాన్ చాలీసా ను పఠిస్తే పుణ్యం లభించదు అంటున్నారు పండితులు .



హనుమాన్ చాలీసా ని జపిస్తున్నప్పుడు దానిలోని ప్రతి పంక్తి అర్ధాన్ని తెలుసుకోవాలి అప్పుడే ఆ కోరికలు నెరవేరుతాయి.  గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసాలోలు అనేక అద్భుతమైన పంక్తులను రచించారు వాటిలో ఒకటి . “నాసై రోగ హరై సబ పీరా, జపత నిరంతర హనుమత బీరా”.  హనుమాన్ చాలీసాలోని 25వ పంక్తి ఇది. ఇందులో గోస్వామి తులసీదాస్ ఆంజనేయ స్వామిని నిరంతరం జపించడం ప్రాముఖ్యతను వివరించారు.



నాశై రోగ: “నాశై రోగ” అనగా  రోగాలు ..వ్యాధులు నశించిపోతాయి, నాశనమవుతాయి. అంటే, ఈ పంక్తిని జపించడం ద్వారా అన్ని రకాల శారీరక వ్యాధులు తొలగిపోతాయి.

హరై సబ పీరా: “హరై సబ పీరా” అంటే అన్ని బాధలు ..నొప్పి.. దుఖం తొలగిపోతాయి.  ఈ పంక్తిని జపించడం వల్ల వ్యక్తి శరీరానికి పట్టిన అన్ని రకాల రోగాలు, కష్టాలు దూరమవుతాయి.

జపత నిరంతర: “జపత నిరంతర” అంటే నిరంతరం ఎల్లప్పుడూ, క్రమం తప్పకుండా జపించడం. అంటే, మీరు ప్రతిరోజూ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే, ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పఠిస్తే,  మీకు ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని అర్ధం.

హనుమత బీరా: “హనుమత బీరా” అంటే ధైర్యవంతుడైన హనుమంతుడు. అనగా.. నిరంతరం హనుమంతుని నామాన్ని జపించేవారికి ఆ మహావీరుని రక్షణ లభిస్తుంది.

హనుమాన్ చాలీసాలోని ఈ పంక్తిని జపించడం వల్ల వ్యక్తికి శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుందని అర్ధం. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ సుఖశాంతులు లభిస్తాయి ఐ చెప్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: