ఇండియాలో క్రికెట్ కి ఎంతగానో క్రేజ్ వున్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే  అంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇండియాలో ఎంతో మంది క్రీడాకారులు ఎన్నో రకాల ఆటలు ఆడినప్పటికీ క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఏ ఆటకు లేదు అనడం లో సందేహం లేదు. ఒక్కొక్క ప్రేక్షకుడికి  ఒక్కో  ఫేవరెట్ లో ప్లేయర్  ఉంటారు అన్న విషయం తెలిసిందే. తమ ఫేవరెట్ ప్లేయర్ మైదానంలో ఆడుతున్నాడు అంటే... టీవీలకు అతుక్కుపోయి టీవీలో ముందునుంచే అలా కాదు ఇలా  ఆడు అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంటారు ప్రేక్షకులు. అంతలా  క్రికెట్ అభిమానులను ప్రభావితం చేస్తుంది. కేవలం పురుషుల క్రికెట్ కాదు ఈ మధ్య మహిళల క్రికెట్ కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 

 


 అటు  బిసిసిఐ మహిళా క్రికెట్ ను కూడా ప్రోత్సహిస్తూ ఉండడంతో మహిళలు కూడా... క్రికెట్ లో దూసుకుపోతున్నారు. ఎన్నో  రికార్డులు బద్దలు కొడుతూ మహిళా క్రికెటర్లు కూడా.. మెయిల్ క్రికెటర్లకు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు సంచలన విజయాన్ని నమోదు చేసింది.. తమదైన శైలిలో అద్భుత ప్రదర్శన చేస్తూ అందరిని  ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. 

 


 అయితే ఈ సిరీస్లో భాగంగా భారత మహిళల జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది అని చెప్పాలి. ఇంగ్లాండ్ చేతిలో వరుస పరాజయాలను చవి చూసింది భారత మహిళల జట్టు.తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్ టీం...  123 పరుగులు చేసింది. భారత మహిళల జట్టు ఓపెనర్స్  స్మృతి మందాన 45 పరుగులు చేయగా... జెమిమా  రోడ్రిక్స్  21 పరుగులతో రాణించారు. కాగా మొత్తంగా 50 ఓవర్లలో 123 పరుగులు చేసినది  టీమిండియా మహిళల జట్టు. ఆ తర్వాత 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు... 18.6 ఓవర్లలోనే లక్ష్య ఛేదన చేసి భారత్ను ఓడించింది. ముక్కోణపు సిరీస్లో భారత్ గెలవాలి అంటే రేపు ఆశిస్తూ జరగబోయే మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: