చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇటీవలే ఐపీఎల్ లో చెన్నై జట్టును  ఛాంపియన్గా నిలిపాడు అన్న విషయంతెలిసిందే. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి టైటిల్ గెలుచుకొని సత్తా చాటింది. అయితే ఇక ఇప్పుడు ధోనిపై ప్రశంసలు కురుస్తున్నాయి అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఐపిఎల్ ముగిసిన వెంటనే మహేంద్ర సింగ్ ధోని ఏకంగా ఆసుపత్రిలో చేరబోతున్నాడట. అదేంటి ధోనీకి ఏమైంది.. ఐపీఎల్లో బాగానే ఉన్నాడు కదా.. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆసుపత్రికి ఎందుకు వెళ్తున్నాడు అనే కంగారు అభిమానుల్లో మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనే మహేంద్ర సింగ్ ధోని మోకాలికి గాయం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు గాయం వేధిస్తున్నప్పటికీ మరోవైపు ఇక జట్టును ఛాంపియన్గా నిలిపేందుకు ధోని నొప్పితోనే మైదానంలో బరిలోకి దిగాడు. ఈ క్రమంలోనే ఒకవైపు మెరుపు బ్యాటింగ్.. మరోవైపు వికెట్ల వెనకాల చిరుత లాగా కదులుతూ అదరగొట్టాడు మహేందర్ సింగ్. ఏకంగా మోకాలికి కట్టు కట్టుకున్న ధోని  అలాగే క్రికెట్ ఆడటం చూసాము. అతని డెడికేషన్ కి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. అయితే ధోని అనుకున్నది సాధించాడు.


 జట్టును ఛాంపియన్గా నిలిపాడు. ఇక ఇప్పుడు తన హెల్త్ గురించి పట్టించుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీంతో ఇక మోకాలి సర్జరీ కోసం ఆస్పత్రిలో  చేరబోతున్నాడు. ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రిలో ఇక చికిత్స పొందుతాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయ్. ముందుగా టెస్టులు చేయించుకుంటాడట. ఇక ఇటీవల సర్జరీ విజయవంతంగా పూర్తయిందట ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో తెలిపారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ కాబోతున్నారట. ధోని త్వరగా కోలుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: