ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ జట్లు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇక మరోవైపు టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉండగా.. మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ ఆడుతుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్, ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ఆడుతూ ఉండగా.. ఈ టెస్ట్ సిరీస్ లో ఘోరపరాభావాన్ని చవి చూసింది పాకిస్తాన్. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఎక్కడ ఆస్ట్రేలియా కు పోటీ ఇవ్వలేకపోయిన పాకిస్తాన్  భారీ పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ జట్టు చేసిన ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇక ఈ ఓటమి తర్వాత అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు పట్టికలో కొన్ని పాయింట్లును కోల్పోయిన పాకిస్తాన్ జట్టు ఇక అగ్రస్థానాన్ని భారత జట్టుతో పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టుకు కూడా పాకిస్తాన్తో కలిపి 66.67 పాయింట్లు ఉండడంతో ఇక పాకిస్తాన్, ఇండియా జట్లు సంయుక్తంగా నెంబర్ వన్ స్థానాన్ని పంచుకున్నాయ్. అయితే ఇక ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు ఐసిసి ఒక బిగ్ షాక్ ఇచ్చింది.


 ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భాగంగా స్లో ఓవర్ రేట్ నమోదు అవ్వడం కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10% కోత విధించింది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కొన్ని పాయింట్లును తగ్గించింది. దీంతో భారత్ 66.67 పాయింట్లు అగ్రస్థానంలో ఉండగా.. 61.1.లతో పాకిస్తాన్ రెండో స్థానంలోకి పడిపోయింది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన పాకిస్తాన్ జట్టు తర్వాత రెండో టెస్ట్ మ్యాచ్లో మాత్రం పుంజుకొని గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: