ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఓ మైలురాయిని అధిగమించాడు హర్షల్ పటేల్. ఐపీఎల్‌లో తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కకావికలానికి గురిచేస్తూ నిలిచిన ఈ మీడియం పేస్ బౌలర్‌ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో తన ప్రస్థానాన్ని 2012లో ముంబయి ఇండియన్స్‌తో ప్రారంభించి, తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున కీలక పాత్ర పోషించాడు. 2021లో ఆర్సీబీ తరఫున తన అత్యుత్తమ సీజన్‌ను గడిపి, మొత్తం 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ విజేతగా నిలిచాడు. ఆ సీజన్‌లో అతని డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందాడు.

2024లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ మళ్లీ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్న హర్షల్‌ వరుసగా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 177 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన హర్షల్ పటేల్‌, ప్రతి సీజన్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్నాడు.

ఐపీఎల్‌లో సోమవారం (మే 19) ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ హోరాహోరీ పోరాటం మధ్య తన 150వ వికెట్‌ను సాధించాడు. లక్నో బ్యాట్స్‌మెన్ ఏడెన్ మార్‌క్రమ్‌ను అవుట్ చేస్తూ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 150 వికెట్ల మైలురాయిని హర్షల్ పటేల్ 2381 బంతుల్లో సాధించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో ఈ ఘనతను అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ విభాగంలో అతడు శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ (2444 బంతులు)ను అధిగమించాడు. మూడో స్థానంలో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఉన్నాడు, అతడు 2543 బంతుల్లో 150 వికెట్లు తీసాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ తరఫున హర్షల్ పటేల్ బరిలోకి దిగి ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. అతని కన్సిస్టెంట్ ప్రదర్శన నేపథ్యంలో వికెట్లు సాధిస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని అద్భుత యోర్కర్లు, స్లో బంతులు ప్రత్యర్థులకు భయం కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: