భారత క్రికెట్‌కు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ తన 44వ పుట్టినరోజును నేడు (జూలై 7)న సెలబ్రేట్‌ చేసుకున్నారు. రాంచీలోని స్వగృహంలో తన సన్నిహిత మిత్రులతో కలిసి చేసిన కేక్ కట్టింగ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్లీవ్‌లెస్ టీషర్ట్‌లో నవ్వుతూ కేక్‌ కోసి మిత్రులకు అందిస్తున్న ధోనీని చూసి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. నిజానికి ధోనీ మాత్రం సాధారణంగా పబ్లిక్ సందడిలాంటి వాటికి దూరంగానే ఉంటారు.

ఇక ధోని పుట్టినరోజును పునస్కరించుకొని విజయవాడలో అభిమానులు ధోనీకి భారీ కటౌట్ ఏర్పాటు చేయడం మరో విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో పాటు, సంప్రదాయ దక్షిణాది వస్త్రధారణలో ఉన్న పోస్టర్లతో అభిమానులు తమ ప్రేమను చాటుకున్నారు. ధోనీకి ఐపీఎల్‌లో దక్షిణ భారతంతో ఉన్న అనుబంధాన్ని ఇది మరోసారి గుర్తు చేసింది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ, 2025లో ఐపీఎల్ సీజన్‌లో చెన్నై తరఫున ఆడారు. జట్టు పెద్దగా మెరుగైన ప్రదర్శన కనబర్చకపోయినా, ధోనీ తన లీడర్‌షిప్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. సీజన్ అనంతరం "ఇంకా ఆరు నెలలు తీసుకొని ఆలోచిస్తాను" అంటూ తన భవిష్యత్తుపై సాంప్రదాయ ధోనీస్టైల్‌లో స్పందించారు.

ధోనీ కెరీర్‌లో మొత్తం 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 17,266 పరుగులు సాధించారు. అలాగే 829 వికెట్లను నేలకూల్చడంలో వికెట్‌కీపర్‌గా పేరుపొందారు. వన్డేల్లో 50.57 సగటుతో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 10,773 పరుగులు బాదారు. శ్రీలంకపై చేసిన 183* పరుగులు ఇప్పటికీ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచింది. ఎటెస్టుల్లో 60 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి, 27 విజయాలు అందించాడు. ఆస్ట్రేలియాపై రెండు సార్లు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో వైట్‌వాష్ చేయడం క్రికెట్ అభిమానులకు ఎప్పటికి గుర్తు ఉంటుంది. ఈ రోజు ధోనీ 44వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, ఆటగాళ్లు, అభిమానులు ఒక్కటై అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: