అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో విశ్వక్ సేన్ చేసిన ఒక ఫ్రాంక్ వీడియో గతంలో నెట్టింట చాలా వైరల్ గా మారింది.. అయితే కొంతమంది మాత్రం విశ్వక్సేను సపోర్ట్ చేస్తే మరి కొంతమంది మాత్రం తీవ్రస్థాయిలో ఈ హీరోని ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్ లో దేవి నాగవల్లి విశ్వక్సేన మధ్య ఒకరిని ఒకరు కామెంట్లు చేయడం చాలా వైరల్ గా మారాయి. ఇక ఆ తరువాత దేవి నాగవల్లి తో ఎవరైనా సరే గొడవ పెట్టుకుంటే వారి సినిమా సక్సెస్ అవుతుందని ఒక వార్త చాలా ప్రచారం జరుగుతోంది.


ఇక ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి నరేష్ ఆగస్త్య, ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హ్యాపీ బర్తడే.. ఈ సినిమా జులై 8వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గెటప్ శ్రీను ఒక న్యూస్ రీడర్ గా నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య.. వంటి వారు ఈ సినిమాలు నేను హీరో అంటే నేను హీరో అని చాలా గొడవలు పడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో లో గెటప్ శ్రీను దేవి నాగవల్లి ని ఇమిటేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.గెటప్ శ్రీను న్యూస్ ఎన్ టీవీ అంటూ తన పేరు దేవి శ్రీ ప్రసాద్ థమన్ అంటు తెలియజేశారు. ఆ తర్వాత గెటప్ శ్రీను సత్య పై వాటర్ బాటిల్ విసురుతూ దేవి నాగవల్లి ఇలా లిమిటెడ్ చేయడం జరిగింది. వెన్నెల కిషోర్ ఒక పదాన్ని వాడడం తో గెట్ అవుట్ ఫ్రొమ్ మై స్టూడియో అంటూ గెటప్ శ్రీను పంచులు వేయడం కూడా జరుగుతోంది. అయితే షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన వెన్నెల కిషోర్ అన్న అక్కడినుంచి డెబిట్ లో పాల్గొనే విధంగా చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: