తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత క్రేజ్ అందుకోవడం జరిగింది. ఈ సినిమా కంటే ముందే ఎన్నో సినిమాలలో విజయ్ ఆంటోనీ నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ తెలుగులో రీమేక్ చేసిన బిచ్చగాడు సినిమా చాలా మంది అభిమానులను సంపాదించుకునేలా చేసింది.ఈ సినిమా ఎమోషన్స్తో అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఇటీవలే విజయ్ ఆంటోని పెద్ద కూతురు మరణ వార్త ఆయనని అభిమానులను సైతం కృంగిపోయేలా చేసింది.


ఇంతటి బాధలో కూడా విజయ్ ఆంటోని ఆ బాధను దిగమింగుకొని మరి బిచ్చగాడు-2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది... ఇదంతా ఇలా ఉండగా గడిచిన కొన్ని రోజుల క్రితం విజయ్ ఆంటోని తన భార్య ఫాతిమాకి విడాకులు ఇచ్చి ఒక బిగ్ బాస్ నటిని వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి.. ఈ విషయంపై విజయ్ ఆంటోని సైలెంట్ గా ఉండడంతో ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి.

కానీ అదే సమయంలో విజయ్ ఆంటోని కూతురు మరణ వార్తతో ఈ వార్తలు ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ నటి ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ -1 లో కంటిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన అనూయ కోలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.. తాజాగా అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ నిర్వహించగా ఈ రూమర్స్ పైన స్పందిస్తూ.. జీవా విజయ్ ఆంటోని, సుందర్ వంటి వారితో రిలేషన్ లో ఉన్నానంటూ చాలామంది ఇలాంటి ఫేక్ వార్తలను సైతం సృష్టించి చాలా ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసింది. తను ఇప్పటికీ సింగల్ గానే ఉన్నానని పెళ్లి ఎఫైర్ వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: