
యాక్టింగ్ ,డాన్స్ పైన ఇష్టంతో ఇంట్లో వారిని కాదని మరి హైదరాబాద్ కి వచ్చానని.. ఇక్కడ ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రేమించిన వాడు కూడా మోసం చేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన శంకర్ రెడ్డి ఎప్పటికీ మర్చిపోలేనని అతనితో రిలేషన్ తనకి పదేళ్లు పైగా ఉన్నదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా అనుక్షణం నీడగా తనకు వెంట ఉండే వారిని తనని ప్రోత్సహిస్తూ ఉండేవారని తెలిపింది.
భాను శ్రీ గా ఇలా మీ ముందు ఉండగలిగాను అంటే అందుకు కారణం శంకర్ రెడ్డి అంటూ తెలిపింది.. బిగ్బాస్ సీజన్ 2 అయిపోయి సుమారుగా ఎనిమిదేళ్లు అవుతూ ఉన్నది. కానీ ఇప్పటికీ శంకర్ రెడ్డి తో భాను శ్రీ రిలేషన్ లోనే ఉన్నానని తెలిపింది. కానీ అసలు తామిద్దరం 18 ఏళ్లుగా రిలేషన్ లోనే ఉన్నామని వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ పూర్తి అయిన తర్వాత శంకర్ రెడ్డి గురించి చెప్పకపోవడంతో చాలామంది బ్రేకప్ చేసుకున్నారేమో అని మాట్లాడుకున్నారు.. కానీ నా ప్రేమ ఎప్పుడూ కూడా బ్రేకప్ చెప్పదు. నా ప్రయాణం ఎప్పుడూ కూడా శంకర్ రెడ్డి తోనే అంటూ భాను శ్రీ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భాను శ్రీ మా మధ్య ఎన్ని గొడవలు జరిగిన కూడా నువ్వు నాతో నేను నీతోనే ఉంటాను అంటూ తెలిపింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అన్నట్టుగా హింట్ ఇచ్చింది భాను శ్రీ.