తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి చాలా గుర్తింపు ఉన్నది. అయితే ఈ కామెడీ షో వల్ల చాలామంది సెలబ్రిటీలుగా మారిపోయారు. మరి కొంతమంది సినిమాలలో నటించేందుకు అవకాశాలు సంపాదించుకున్నారు. అలా వెండితెర పైన బుల్లితెర పైన తన కామెడీతో సత్తా చాటిన కమిడియన్లలో శాంతి కుమార్ కూడా ఒకరు. జబర్దస్త్ లో కమెడియన్ గా ఉన్న శాంతి కుమార్ ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా కమెడియన్ గా నటించారు. అయితే ఒక సినిమాతో డైరెక్టర్ గా మారారట.ఆ సినిమా విడుదల అయిందో లేదో తెలియదు కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.


ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చించుకున్న సమయంలో పలు వ్యాఖ్యలు చేశారు శాంతి కుమార్. అమ్మాయిలు అంటే దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలే డైరెక్ట్ గా కూడా కొన్ని సందర్భాలలో అడుగుతారని కూడా వెల్లడించారు శాంతి కుమార్. కేవలం ఒక్క సినిమాను డైరెక్టర్ చేసిన తనకి నీకు ఏది కోరుకుంటే అది ఇస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వమని చాలా మంది అమ్మాయిలు తనకి కూడా మెసేజ్లు చేశారని తెలియజేశారు.


కేవలం కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారిన నా పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన డైరెక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అంటు శాంతి కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంది నేటిజన్స్ నిన్ను చూసి కూడా అమ్మాయిలు వస్తామంటున్నారా..? అంటూ పలు రకాల స్మైల్ ఎమోజి లను వైరల్ చేస్తున్నారు.. మరి కొంతమంది మాత్రం ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో కూడా ఈ కమెడియన్ పెద్దగా కనిపించలేదు. మరి ఏదైనా సినిమాలలో నటిస్తున్నారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: