తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించిన నటి అన్షు రెడ్డి ఇప్పటికే పలు రకాల సీరియల్స్ లో కూడా నటించింది. ఈమె అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తోంది అన్షురెడ్డి. ఢీ 20 వ సీజన్లో కొత్త కంటెస్టెంట్లతో కాకుండా పాత వాళ్ళతోనే నడిపిస్తున్నారు. మణికంఠ, పండు, రాజు, జతిన్, హేమ, అన్షు రెడ్డి మరి కొంతమంది పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ప్రోమోలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.



యూట్యూబ్లో భారీ పాపులారిటీ సంపాదించిన కుకు కుమారి అనే పాటకి ఢీ స్టేజ్ పైన అన్షు రెడ్డి , తన డ్యాన్స్ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేసింది. ఈమె డాన్స్ కూడా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అన్షు రెడ్డి పర్ఫామెన్స్ చూసిన రెజీనా కూడా తెగ మెచ్చుకుంది. అయితే ఈ పెర్ఫామెన్స్ చివరిలో అన్షు రెడ్డి పైన డాన్స్ మాస్టర్ ఒక కిస్ ఇచ్చారు. ఇది ఫ్యాన్స్ కి అసలు నచ్చినట్టుగా కనిపించలేదు. సాంగ్ అంతా బాగానే ఉన్నా కానీ అన్షుకి ఇలా కిస్ ఇవ్వడం మాస్టర్ ఏం బాగాలేదు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


మరి కొంతమంది ఫన్నీ డైలాగులతో ప్రోమో కింద కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన నటి అన్షు రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ డాన్స్ తో బాగా ఆకట్టుకుంటున్నారు. ఢీ 20 సీజన్ విన్నర్ ఎవరో చెప్పడం కూడా చాలా కష్టంగా మారుతోంది. ఈ సీజన్ కి మాత్రం జడ్జిలుగా విజయ్ బిన్నీ మాస్టర్, హీరోయిన్ రెజీనా ఉండగా యాంకర్ గా నందు వ్యవహరిస్తున్నారు.. అలాగే హైపర్ ఆది, సౌమ్యరావు టీమ్ లీడర్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: