ప్రస్తుతం ఆన్లైన్ మెసేజ్ యాప్ లలో  నెటిజెన్ లను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న యాప్ ఏది  అంటే అందరికీ తెలుసు అది వాట్సాప్ మాత్రమేనని. ఏ  మెసేజ్ యాప్ కి సాధ్యం కాని రీతిలో వినియోగదారులను కలిగి ఉంది వాట్సాప్. ప్రస్తుతం వాట్సాప్ ద్వారానే అన్ని సంభాషణలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నెటిజన్లు . రోజులో వందలసార్లు వాట్సాప్ చేసుకుంటూనే ఉంటారు అందరూ. దీంతో ఒక మనిషి జీవితంలో వాట్సప్ అనేది ఒక భాగంగా మారిపోయింది.అయితే అటు తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు ఆకర్షించేందుకు వాట్సప్ ఎప్పుడు సరికొత్త ఫీచర్లతో తెర మీదికి వస్తుంది అన్న విషయం తెలిసిందే. 

 


 ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సరి కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందించింది వాట్సాప్. ఇక తాజాగా మరో సరికొత్త ఫీచర్ను వినియోగదారుల కోసం సిద్ధం చేసింది. అదే వాట్సప్ పేమెంట్స్ ఆప్షన్. ఈ పేమెంట్స్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ నుంచి మెసేజ్లు చేసుకోవడమే కాదు... నగదును పంపుకోవడానికి స్వీకరించడానికి కూడా వీలు ఉంటుంది. గత కొన్ని నెలల నుంచి ఈ పేమెంట్స్ ఆప్షన్ పై  ట్రైల్స్  వేసిన వాట్సప్ చివరకు... పేమెంట్స్ ఆప్షన్ ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ వాట్సప్ అతి పెద్ద మార్కెట్ అయిన బ్రెజిల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. 

 


 కొన్ని రోజుల్లో ఇతర దేశాలకు కూడా ఈ ఫీచర్  అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఈ సదుపాయాన్ని వాట్సాప్ యూసర్లు  అందరూ ఉచితంగా వినియోగించుకోవడానికి వీలుంది. కానీ బిజినెస్ సర్వీస్ కు  మాత్రం 3.99 శాతం ప్రాసెసింగ్  చెల్లించాల్సి ఉంటుంది. 6 నెంబర్ల పిన్ లేదా... ఫింగర్ ప్రింట్ ఫీచర్ ద్వారా లావాదేవీలను చేయడానికి కూడా ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ లో   అవకాశం ఉంటుంది  మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులకు  కూడా ఈ పేమెంట్స్ ఆప్షన్   సపోర్ట్ చేస్తుంది. ఈ పేమెంట్స్ ఫీచర్ వల్ల వాట్సాప్ కి   వినియోగదారుల  సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: