రెండు రోజుల క్రితం విడుద‌ల అయిన ల‌వ్ స్టోరీ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ల‌వ్ స్టోరి రాలేద‌ని సిని ప్రేమికులు అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు ను ఊప‌డం ఖాయ‌మ‌ని ఈ సినిమా చూసిన వారు అంటున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా చాలా మంది స్టార్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అక్కినేని హీరో నాగ చైత‌న్య కెరీయ‌ర్ లో ఇది ఒక పెద్ద హిట్ అవుతుంద‌ని సిని విమ‌ర్శ‌కులు కూడా చెబుతున్నారు. క‌థ ను డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల చక్క‌గా డిజైన్ చేశారని కూడా అంటున్నారు.అయితే తాజా సోష‌ల్ మీడియాలో ఒక వీడియో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోలో ఒక బాలుడు ల‌వ్ స్టోరీ డైరెక్ట‌ర్ శేఖర్ క‌మ్ముల పై సంచ‌ల‌న వ్యాఖ‌లు చేస్తున్నాడు. ఈ సినిమా లో ఒక సంద‌ర్భంలో ల‌క్ష్మీ దేవత ప‌క్క‌న యేసు క్రీస్తు పోటోను ఉంచుతారు. దీన్ని వ్య‌తిరేకిస్తూ ఆ బాలుడు డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల పై విరుచుకు ప‌డుతాడు. ఈ వీడియా ప్ర‌కారం ఏమ‌య్య శేఖ‌ర్ క‌మ్ముల.. నీకు ఎమైనా కొమ్ముల అంటు స్టార్ట్ చేశాడు. ఎలా మా దేవ‌త ప‌క్క‌న యేస్ ఫోటో పెడుతావ్ అంటు ప్రశ్నిస్తాడు. మా హిందువులు న‌న్ను ఏమీ చేయాలేర‌ని న‌మ్మ‌క‌మా.. మా సంస్రృతి అవమానిస్తున్నావ్ అని అంటాడు. నీ భార్య పక్క‌న కూడా ప‌క్కింటి వాడి ఫోటో పెడుతావా అంటు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. హిందువుల‌కు త‌క్ష‌ణ‌మే క్షేమ‌ప‌ణ చేప్పాల‌ని.. ఆ సీన్ కూడా డీలిట్ చేయాల‌ని డిమాండ్ చేశాడు.
అయితే వీడియో పై భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి. ఇంత చిన్న బాలుడు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని కామెంట్లు పెడుతున్నారు. అలాగే సినిమాలో ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌ను భూత అద్దంతో చూడ‌వ‌ద్ద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. మ‌రి కొంత మంది అయితే వెంట‌నే ఈ బాలున్ని స్కూల్ కు పంపించ‌డి అని జోక్ వేస్తున్నారు. ఎది ఏమైనా సినిమా లో ఇలా వ‌చ్చే చిన్న చిన్న‌ వాటిని చూపి పిల్ల‌ల హృద‌యంలో త‌ప్పుడు భావాల‌ను నింపండం స‌రైంది కాద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.  
మరింత సమాచారం తెలుసుకోండి: