సాధారణంగా పాఠశాలలో గురువులు విద్యార్థుల పట్ల కాస్తకఠినంగానే ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ మాత్రం కఠినంగా లేకపోతే విద్యార్థులు ఉపాధ్యాయులకు భయపడని అలాంటప్పుడు చదువును కూడా లైట్ తీసుకుంటారు అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం ఏకంగా విద్యార్థులతో స్నేహితుల్లాగా కలిసి పోయి వారికి పాఠాలు బోధిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని చక్కగా అర్ధమయ్యేలా చెబుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.


 కేవలం చదువులోనే కాదు ఆటలో పాటలో కూడా ఎంతో మంది టీచర్లు విద్యార్థిలను ప్రోత్సహిస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ చదువులేనా అప్పుడప్పుడు ఆటలు పాటలు కూడా ఉండాలి అంటూ వైవిధ్యభరితమైన యాక్టివిటీస్ నిర్వహిస్తూ పిల్లలకు ఎంతో ఆనందాన్ని పంచుతూ ఉంటారు ఇలా విద్యార్థుల మనసుకి దగ్గరైన టీచర్లను అటు స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతగానో అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ టీచర్ ఇలాంటిదే చేసింది. ఇప్పుడు పాఠాలు చెప్పుకోవడమేనా అప్పుడప్పుడూ డాన్సులు కూడా చేయాలి అంటూస్కూల్ విద్యార్థులతో డాన్సులు చేయించింది. ఒక స్టూడెంట్ డాన్స్ చేస్తుంటే పక్కనే ఉండి ప్రోత్సహించింది.


 అక్కడితో ఆగలేదు ఏకంగా విద్యార్థులతో కలిసి అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేసి అక్కడ ఉన్న విద్యార్థులు అందరిని కూడా అలరించింది. ఇక ఈ వీడియోని ఉపాధ్యాయిని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. టీచర్లు పిల్లల్ని ఆప్యాయంగా చూసుకుంటే వారు కూడా అదే ప్రేమను పొందుతారూ అంటూ కామెంట్ కూడా చేసింది. పిల్లలు కూడా ఇలాంటి టీచర్లే కావాలని కోరుకుంటున్నారని వారి పట్ల కఠినంగా కాకుండా ప్రేమగా ఉంటే చదువులోనే కాదు అన్ని రకాల యాక్టివిటీస్ లో కూడా పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: