
ఇలా ఇటీవల కాలంలో సమోసా క్రేజ్ కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా కూడా సమోసాను స్నాక్స్ గా తీసుకోవడానికి ఇష్టపడేవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా సమోసాను ఇష్టపడేవారు ఇక్కడ ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం మరోసారి సమోసా ముట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. అంతేకాదు ఇన్ని రోజులపాటు ఇలాంటి ఒక ఆహారాన్ని మేము ఇష్టంగా తిన్నామా అని కాస్త వికారంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.
సాధారణంగా సమోసా కి అంత టేస్ట్ రావడానికి ఇక సమోసా లోపల ఉండే కూర కారణం అన్న విషయం తెలిసిందే. ఇక లోపల ఉండే కూర ఎంత టేస్టీగా ఉంటే సమోసా టేస్ట్ కూడా అంతే పెరిగిపోతూ ఉంటుంది. అయితే సమోసా కూరను ఎలా తయారు చేస్తున్నారో ఇక ఈ వీడియోలో చూడవచ్చు. ఒక వ్యక్తి సమోసాలో పెట్టే కూర కోసం అవసరమయ్యే బంగాళదుంపలను కడుగుతున్నాడు. అయితే చేతితో కడగట్లేదు ఒక పెద్ద గిన్నెలో ఆ బంగాళదుంపలను వేసి ఆ కుర్రాడు కాలితో పైగా అపరిశుభ్రంగా ఉన్న చెప్పులు వేసుకుని దారుణంగా తొక్కుతూ ఉన్నాడు. ఇక ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.