
అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయం పై పలు రకరకాల వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటన పైన కుట్ర జరిగిందా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయట. గాల్లోకి ఎగిరిన విమానం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇంతటి స్థాయిలో విధ్వంసం చేయడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విధంగా అధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తూ విచారణ చేపడుతున్నారట.
అలాగే టెక్నికల్ ఫలంగా ఏదైనా ఫెయిల్యూర్ అయ్యి ఉంటే ఈ విషయం పైన కూడా అధికారులకు దర్యాప్తు చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాద సమయంలో ఫైలెట్ ఏటీసీకి మే డే కాల్ చేసినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు తిరిగి ఏటీసీ పైలెట్లను సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పుడు విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని.. ఆ తర్వాత కేవలం కొన్ని సెకండ్లలోని ఫ్లైట్ క్రాష్ అయ్యిందంటూ తెలుపుతున్నారు. మరి ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటన్నది ఎప్పుడు అందర్నీ సస్పెన్స్ గా గురిచేస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాలి అంటే బ్లాక్ బాక్స్ కీలకంగా మారబోతోందట. మరి ఆ బాక్స్ లో నుంచి ఎలాంటివి బయటపడతాయో చూడాలి మరి.