ఇది నిజంగా మొబైల్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . ఈ మధ్యనే మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే . అసలే ఉన్న రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని మొబైల్ కి రీఛార్జ్ చేసుకోవాలి అంటే అల్లాడిపోతున్న మధ్య తరగతి ప్రజలకు నెత్తిన మరో పెను భారం పడబోతుంది అన్న విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ ఏడాది చివరినాటికి మొబైల్ రీఛార్జి ధరలు దాదాపు 12 నుంచి 18% పెరిగే అవకాశం ఉంది అంటూ  నివేదికలు చెబుతున్నాయి.  గత జులై 2024లో టెలికం కంపెనీలు ఉన్న ధరలను 11 నుంచి 23% వరకు పెంచాయి .


అదే పెనుభారంగా ముందుకు వెళ్తున్న సమయంలో మరోసారి రీఛార్జ్ ప్లాన్లు పెంచే అవకాశం ఉంది అంటూ వార్తలు రావడం మిడిల్ క్లాస్ వాళ్ళకి మరింత ఇబ్బందికరంగా మారిపోయింది . రీఛార్జి ప్లాన్స్ మరింత ఖరీదైనవిగా మారబోతున్నాయి అంటూ నివేదికలు చెబుతున్నాయి . అయితే ఈసారి కంపెనీలు కొత్త విధానాన్ని అనుసరించబోతున్నట్లు సమాచారం అందుతుంది . మధ్య స్థాయి ఖరీదైన రీచార్జి ప్లాన్లు ఎంచుకునే  వినియోగదారులపై ఈ ధరల పెంపు ఎక్కువగా ఉంటుంది అనేలా ఓ న్యూస్ బయటకు వచ్చింది. భారతీయ ఎయిర్టెల్ . రిలయన్స్ జియో , వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ టెలికాం సంస్థలు ఈ ధరల పెంపును అమలు చేయబోతున్నట్లు ఓ నివేదిక తెలిపింది .



కాగా గత ధరల పెంపు తర్వాత కేవలం 18 నెలల్లోనే మరోసారి ధరలు పెరగబోతూ ఉండటంతో వినియోగదారులు భారంగా ఫీల్ అవుతున్నారు . ఈ ధరల పెంపుకు ప్రధాన కారణం మే నెలలో యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య కదనీయంగా పెరగడమే అంటూ తెలుస్తుంది . దీంతో భారత టెలికాం రంగంలో మొత్తం ఆక్టివ్ సబ్స్క్రైబర్లు  రావడం కూడా ధరలు పెరగడానికి మరో బిగ్ రీసన్ అంటున్నారు నిపుణులు . తక్కువ ప్లాన్ ధరలను పెంచితే వినియోగదారులు ఇతర టెలికాం కంప్యూటర్లకు మారే అవకాశం ఉంది . కావున తక్కువ ధరల ప్లాన్లను అలాగే ఉంచి ఎక్కువ ధరల ప్లాను పెంచాలని చూస్తున్నారట ఆయాసంస్థలు . ఈ ధరల పెంపు విధానంలో కంపెనీలు డేటా వినియోగం ..డేటా స్పీడ్ ..ఎక్కువ డేటా ఇలాంటివి ప్రధానంగా చేసి విభజించే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది . టెలికాం కంపెనీలు తమ వ్యాపార లాభాలను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అంటూ ఈజీగా అర్థమయిపోతుంది . మరి ఈ మార్పులు జనాలు ఎలా స్వీకరిస్తారు అనేది వేచి చూడాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: