అమరపాలి ఒంగోలు లో పుట్టారు. వారి తల్లితండ్రులు కాటా వెంకట్ రెడ్డి, కాటా పద్మావతి. ఉన్నత చదువుల కోసం ఆమ్రపాలి విశాఖపట్నం వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఐఏఎస్ పరీక్షల్లో విజయం సాధించి ఆంధ్రపరదేశ్ కేడర్ 2011 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ గా విధుల్లోకి చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు పనిచేసారు. ప్రస్తుతం ఆమ్రపాలి ప్రధాన మంత్రి కార్యాలయం లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ఈ పదవిలో మూడేళ్ళ పాటు ఉంటారు.

ఆమ్రపాలి మన తెలంగాణ ప్రజలకు సుపరిచిత్రమే. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక ఆమ్రపాలి ఇక్కడికి వచ్చి పలు హోదాల్లో ఉంటూ బాధ్యతలను నిర్వర్తించారు. ఆమె మొదట 2011 లో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా మొదట జాయిన్   అయ్యారు. ఆ తర్వాత రంగారెడ్డి జేసీ గా వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసారు.తన పని తీరుతో అందరి మన్నలను అందుకున్నారు కలెక్టర్ ఆమ్రపాలి.

ఆమ్రపాలి కుటుంబమంతా ఉద్యోగులే అన్న విషయం మీకుతెలుసా. ఆమ్రపాలి తండ్రి ఆంధ్ర యూనివర్సిటీ లో ప్రొఫెసర్  గా చేస్తున్నారు. అలాగే ఆమె సోదరి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. ఈమె కర్ణాటక లో పనిచేస్తున్నారు. మరియు సోదరి భర్త భర్త కూడా ఐఏఎస్ అధికారి. ఇతడు ప్రస్తుతం తమిళనాడు కేడర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.అలాగే ఆమ్రపాలి 2018వ సంవత్సరం లో సమీర్ శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సమీర్ శర్మ డామన్ డయ్యు కి
ఎస్పీ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా కుటుంబం లోని వారందరు తమ తమ వృత్తుల్లో విధులు నిర్వర్తించడం విశేషం.

ఆమ్రపాలి వరంగల్ జిల్లాకి కలెక్టర్ గా ఎనలేని సేవలను అందించారు.ఆమె కలెక్టర్ హోదాలో ఉంటూ చేసిన ప్రసంగాలు యువతకి ఆదర్శ ప్రాయమైయ్యాయి. ఆమె పని తీరు చూస్తే అందరిలో ఐఏఎస్ ఆఫీసర్ ల కంటే కంటే విభిన్నంగా ఉండేవారని అందరు అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: