
ఆడవారికి ఆభరణాలు ఎంత అందాన్నిస్తాయో పెద్దగా చెప్పనవసరం లేదు. అలాగే వారు పెట్టుకునే కమ్మలు కూడా వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఇలా కమ్మలు పెట్టుకునే వారిలో రంధ్రాలు ఒక్కొక్కరికి ఒక్కో తరహాలో ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. కొంతమందికి మామూలు సైజులో ఉంటే, మరి కొంతమందిలో సాగిపోయి చెవి తెగిపోయే స్థితికి వస్తుంది. ఇందుకు కారణం వయసు మీద పడటం, బరువైన ఆభరణాలు ధరించడంలాంటి కారణాలవల్ల చర్మం బలహీనంగా మారి రంధ్రాల సైజు పెద్దగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కారణంగా కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటిని చిన్నగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు చెప్పబోయే మూడు చిట్కాలు పాటించి, సాగిపోయిన చెవి రంద్రాలను సన్నగా చేసుకోండి.ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
1. దాల్చిన చెక్క - కొబ్బరినూనె:
దాల్చినచెక్క వంటగదిలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి కొబ్బరినూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ రెండింటినీ ఉపయోగించి మనం చెవి రంద్రాలను చిన్నగా చేసుకుందాం. ఇందుకోసం ముందుగా దాల్చినచెక్కను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడికి,వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు చెవి రంధ్రాలకు పట్టించి పడుకోవాలి. ఇదే పద్ధతిని వరుసగా వారం రోజులు పాటిస్తే సాగిపోయిన చెవి రంధ్రాలను బిగుతుగా తయారవడం గమనించవచ్చు.
2. టూత్ పేస్ట్:
టూత్ పేస్ట్ చర్మ రంధ్రాలను బిగుతుగా చేసే ప్రక్రియలో మొదటి పాత్ర వహిస్తుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు టూత్ పేస్ట్ ను తీసుకొని,చెవి రంధ్రానికి ఇరువైపులా పట్టించాలి. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ పద్ధతిని తరచూ పాటిస్తూ ఉండడంవల్ల త్వరలోనే చెవి రంధ్రాలు సైజు తగ్గడం ఎవరు ఆపలేరు.
3. ఆవనూనె - పసుపు :
ఆవనూనె,పసుపు రెమెడీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ ఆవనూనె తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి రాత్రి పడుకునే ముందు చెవి రంధ్రాలకు అప్లై చేయాలి. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకోవాలి. చల్లని నీటికి చర్మాన్ని బిగుతుగా చేసే లక్షణం ఉంటుంది.కాబట్టి ఎక్కువ సార్లు చల్ల నీటితోనే చర్మాన్ని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఈ పద్ధతిని పాటించడం వల్ల సాగిపోయిన మీ చెవి రంధ్రాలు తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేసుకోవచ్చు.
పైన చెప్పిన చిట్కాలను పాటించి సాగిపోయిన చెవి రంధ్రాలను మామూలు స్థితికి ఎటువంటి ఖర్చు లేకుండా తీసుకురావచ్చు.