జూనియ‌ర్ ఎన్టీఆర్ విసిరిన *బీ ద రియ‌ల్ మ్యాన్‌* స‌వాల్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీక‌రించారు. ఈరోజు ఉద‌యం త‌న ఇంట్లోని హాల్‌ని శుభ్ర‌ప‌ర‌చ‌డంతో పాటు పెస‌ర‌ట్టు ఉప్మా చేశారు. త‌న మాతృమూర్తి అంజ‌నాదేవికి వ‌డ్డించారు. అమ్మ తినిపిస్తుంటే చిరు కూడా తిన్నారు. ఇక చిరు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హీరో ర‌జినీకాంత్‌ను నామినేట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే.. ఇక్క‌డ చిరు, ప‌వ‌న్ క‌ల్యాన్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్న‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది.

 

చిరు పోస్ట్ చేసిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో జ‌నసేన అధినేత‌, హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ నటిస్తున్న వ‌కీల్‌సాబ్ సినిమాలోని మ‌గువా మ‌గువా పాట వినిపించ‌డం అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. అయితే.. ఆ పాట‌కు చిరు స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నార‌నే అప్పుడే మొద‌లైంది. అవ‌స‌రం అయితే.. పాట డ్యాన్స్ కంపోజింగ్‌లో చిరు మార్క్ ఉంటుందని అనుకుంటున్నారు. అంతేగాకుండా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక ముందుముందు దీనిపై మ‌రెన్ని ముచ్చ‌ట్లు వినిపిస్తాయో చూడాలి మ‌రి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: