ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కేబినెట్ సమావేశం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఏపీ క్యాబినెట్ లో పలు కీలక నిర్ణయాలను మంత్రిమండలి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది అత్యవసర కేబినెట్ సమావేశం అని కూడా అంటున్నారు. కొంతమంది మంత్రులకు సంబంధించి మంత్రివర్గం ముందు ముఖ్యమంత్రి జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టే అవకాశముందని ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రచారం జరుగుతోంది.

అలాగే ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దెబ్బ ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా పడిన నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లే అవకాశం ఉందని ఈ నెల 30వ తారీఖున  సమావేశం జరిగే సూచనలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. తుఫాన్ కు సంబంధించి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap