గుజరాత్ లో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు దాడులు కొన‌సాగిస్తున్నాయి. పంచ‌మ‌హ‌ల్ జిల్లాలోని గోద్రాలో కౌంట‌ర్ ఇంట‌లిజెన్స్ బృందాలు త‌నీఖీలు చేప‌డుతున్నాయి. ఒక మహిళ తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తు లో భాగంగా దాడులు చేస్తున్న‌ట్టు స‌మాచారం. విశాఖ నేవీ సిబ్బంది హనీ ట్రాప్ కేసులో ఐఎస్ఐ ఏజెంట్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గుజ‌రాత్‌లోని పంచమహల్ జిల్లాలోని ఒక యువతి ద్వారా నేవీ సిబ్బంది ని ట్రాప్ చేసినట్టు అప్పట్లో కేసు నమోదు అయింది.

తాజాగా నిర్వహించిన దాడుల్లో ఐఎస్ఐ ఏజెంట్ తో పాటు ఓ యువతి మరో ముగ్గురిని అదుపులోకి  తీసుకున్నారు  ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ మరియు ఎన్ఐఏ పోలీసులు.  పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీక‌రించ‌లేదు. 2019లో విశాఖ‌ప‌ట్నం హానీట్రాప్ కు సంబందించిన కేసులో పాకిస్తాన్‌కు చెందిన కొంద‌రూ గూఢ‌చారులు భార‌త నౌక‌లు, జ‌లాంత‌ర్గామ‌ముల లొకేష‌న్ త‌దిత‌ర స‌మాచారం సేక‌రించేంద‌కు జూనియ‌ర్ స్థాయి నేవీ అధికారుల‌ను ట్రాప్ చేసిన‌ట్లు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చిన విష‌యం విధిత‌మే. ముఖ్యంగా సోష‌ల్ మీడియా ద్వారా అంద‌మైన యువ‌తుల‌ను ఎర వేసి.. స‌మాచారాన్ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు..మరింత సమాచారం తెలుసుకోండి: