అజాదీ కా అమృతోత్సవ్‌ వేళ తెలంగాణ ఆర్టీసీ అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. 12 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా అనేక ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 15 రోజున  టీ-24 బస్‌ టికెటును ఆ రోజున రూ.75 కే అమ్ముతారు. సాధారణ రోజుల్లో ఈ టికెట్‌  రూ.120 వరకూ ఉంటుంది. అంటే 45 రూపాయలు తక్కువకే ఈ టీ 24టికెట్‌ లభిస్తుందన్నమాట.


అలాగే టీటీడీ ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు ఆజాదీ అమృత్ మహోత్సవ్ స్పెషల్‌గా  రూ.75 తగ్గింపు ఇస్తోంది. అలాగే ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్‌ ను 75 కిలోమీటర్ల వరకు ఉచితంగా రవాణా చేస్తున్నారు. దీంతో పాటు టాప్‌-75 ప్రయాణికులకు ఒక ట్రిప్‌ టికెటు ఉచితంగా ఇవ్వబోతున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్‌ ఎయిర్‌ పోర్ట్‌ సర్వీసు కోసం 75 శాతం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. అంతే కాదు..  75 సంవత్సరాలు దాటిన వారికి తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్ష ప్యాకేజీని కూడా ఆర్టీసీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: