విజయ్‌ దేవరకొండ హీరోగా ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్.. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌మూవీ లైగర్‌ నిర్మాత చార్మి అన్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆగస్ట్ 19న ఓ ఇంటర్వ్యూను విడుదల చేయబోతున్నారు.

ఈ ఇంటర్వ్యూ స్పెషాలిటీ ఏంటంటే.. నిర్మాత చార్మీ.. హీరో విజయ్ దేవరకొండను, పూరీ జగన్నాథ్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలను చార్మీ అడిగింది. అందులో భాగంగా కరోనా సమయంలో లైగర్ సినిమాను ఓటీటీకి ఇవ్వమని ఓ భారీ ఆఫర్ వచ్చిందని తెలిపారు. అలాంటి ఫ్యాన్సీ ఆఫర్‌ను వదిలేయడానికి ఎంతో ధైర్యం ఉండాలని చార్మీ అంటే.. అప్పట్లో చేతిలో రూపాయి లేక నువ్వు ఎంత ఏడ్చావో నాకు తెలుసంటూ పూరీ గుర్తు చేసుకున్నారు. అభిమానులు నుంచి వచ్చిన అనేక ప్రశ్నలను ఛార్మి అడిగిన ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఫుల్ ఇంటర్వ్యూ 19 న రాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: