తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 2290 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో 2068 మంది పురుషులు ఉండగా.. 221 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. 119 నియోజకవర్గాల్లోనూ భారాస అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, ఒక స్థానంలో సీపీఐ పోటీ చేస్తున్నాయి. 111 నియోజకవర్గాల్లో భాజపా, 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

 అలాగే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 48 మంది పోటీ చేస్తున్నారు. నారాయణపేట, బాన్సువాడ స్థానాల్లో అత్యల్పంగా ఏడుగురు పోటీ మాత్రమే పోటీలో ఉన్నారు. ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్లకు పైగా ఓటర్లు తేల్చనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: