విధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇదే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే  ఒక మనిషి భూమి మీద ఎన్నేళ్ల  పాటు ఉండాలి అన్నది ఆ విధి నిర్ణయిస్తూ  ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కూడా విధి చిన్నచూపు చూడటం కారణంగా చివరికి మృత్యువు దరిచేరుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల కాలంలో విధి ఆడిన వింత నాటకంలో సొంతవారే ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారి ప్రాణాలను తీసేస్తున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను కన్న తల్లి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో చోటుచేసుకుంది. అయితే మానసిక స్థితి సరిగా లేని తల్లి  నాలుగు నెలల చిన్నారిని దారుణంగా ప్రాణాలు తీసేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. హుకుంపేట మండలం హరిగిరి గ్రామంలో అరిసెల రాధిక అనే మహిళ ఉంది.


 గత కొన్ని రోజుల నుంచి మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటే సదరు మహిళ. అయితే ఇటీవలే సదరు మహిళ ఒక చిన్నారికి జన్మనిచ్చింది. కాగా కూతురు భార్యను ఇంటి దగ్గరే వదిలేసి భర్త పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే సాయంత్రం ఇంటికి రాగానే నాలుగు నెలల చిన్నారి కూతురు విగతజీవిగా పడి ఉండడం చూసి తట్టుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే భార్య పని చేసి ఉంటుందని ఆ గదిలోకి వెళ్ళాడు. చివరికి అక్కడ కూడా చూసి షాక్ అయ్యాడు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది భార్య. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: