
అయితే పాము కాటుకు గురైన తర్వాత వెంటనే ఆసుపత్రికి వెళ్తే.. ఇక వైద్యులు చికిత్స చేస్తారు తద్వారా ప్రాణాలను రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా పాముకాటుకు గురైన తర్వాత ఆకుపసర్ల ద్వారా విషానికి విరుగుడు వేయవచ్చు అని నమ్మకం కొంతమంది చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి ఘోరం జరిగింది. ఇంట్లో పాము కాటుకు గురైన తండ్రి కొడుకులు చివరికి ప్రాణాలు కోల్పోయారు
రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన రవి అనే 41 ఏళ్ల వ్యక్తి అతని కొడుకు వినోద్ అనే పన్నెండేళ్ల బాలుడు చనిపోయాడు. అయితే వ్యవసాయ కూలీ అయిన రవి రోజులాగే రాత్రి తమ పెంకింట్లోనే అరుగు మీద పడుకున్నాడు. అయితే ఇంట్లోకి చొరబడిన ఒక నాగుపాము నిద్రలో ఉన్న వినోద్ ను కరిచింది అయితే దానిని గమనించిన రవి పామును చంపేందుకుప్రయత్నిస్తూ పాము కాటుకు గురయ్యాడు చివరికి ఆపై పామును చంపేశాడు అయితే వినోద్ ఛాతిలో నొప్పి ఉందని ఏడవగా.. ఆసుపత్రికి వెళ్లకుండా ఇరువురు ఇంట్లో ఉన్న ఆకుపసరు వేసుకున్నారు. తర్వాత కొద్ది నిమిషాలకే వాంతులు చేసుకున్న వినోద్ గంట తిరిగే సరికి ప్రాణం వదిలాడు. ఆ తర్వాత రవి కూడా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పడంతో వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు. అయితే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించిన అప్పటికే ఆలస్యం కావడంతో అతని ప్రాణాలు కూడా పోయాయి.