అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఆర్థిక సంక్షోభాన్ని తాజాగా ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ అప్పు తీసుకోవడానికి లిమిట్ పెట్టారంట ఇప్పుడు. ఆ అప్పు లిమిట్ అనేది 31.9 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తుంది. గతంలో ట్రంప్ పరిపాలన కాలంలో ఇది 29 డాలర్లు ఉండేదని తెలుస్తుంది. ఆ తర్వాత అది 30 నుండి 31 కి వచ్చి చివరికి 31. 9 బిలియన్ డాలర్ల దగ్గర ఆగిందని తెలుస్తుంది.


నిజం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఆర్థిక సంక్షోభం రావడానికి అసలు కారణం ఏంటంటే ఈ అప్పు లిమిట్ అనేది జనవరి నాటికే పూర్తయిపోయిందని తెలుస్తుంది. మరి ఎలా అయిపోయాయి అంటే కరోనా టైం లో చేసిన కార్యక్రమాల వల్ల, ఇంకా పలు సంక్షేమ పథకాల వల్ల, పలు ఇండస్ట్రీలకు ఇచ్చిన ఇంక్రిమెంట్స్ వల్ల ఇలా అప్పు తీసుకొచ్చినదంతా కూడా ఖర్చు అయిపోయిందని చెప్పారట బైడెన్. వివిధ కార్పొరేషన్లు నుండి ఇంకా వివిధ పన్నుల నుండి వచ్చిన సొమ్మును  జనవరి నుండి ఏప్రిల్ వరకు వాడేసినట్లుగా తెలుస్తుంది.


ఇప్పుడు అప్పు ఇచ్చేందుకు పర్మిషన్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే లేకపోతే అక్కడ పార్లమెంట్లో సెనెటర్లకు కూడా జీతాలు ఇవ్వడానికి కుదరదు. హాస్పిటల్స్ నడపడానికి ఉండదు. స్కాలర్ షిప్ లు ఆగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడానికి ఉండదు. లక్షల ఉద్యోగాలు పోతాయి కూడా. ఈ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ బైడెన్ సర్కార్ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చిందని తెలుస్తుంది.


ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో అమెరికా తర్వాత ప్లేస్ లో, రెండో ప్లేస్ లో చైనా ఉంది. ఈ విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకొని చేయకపోతే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న అమెరికా ఆర్థిక పరిస్థితి విషయంలో దిగజారి పోతుందని ఆయన అన్నారు. అది మాత్రమే కాకుండా చైనా ఆర్థికంగా తమను దాటి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని ఆయన చెప్పారు. చైనా విషయంలో మాత్రం మనం చులకనవ్వకూడదని ఆయన అన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: