దేశంలోనే అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది చాలా స్పెషల్. మనదేశంలో 10 కంటే ఎక్కువసార్లు శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన వారు ఉన్నారు. బీహార్ లోను అలాంటి సీనియర్ నేతలు ఉన్నా ఇప్ప‌టి వరకు ఎవరూ పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైలురాయి అందుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ చరిత్ర క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు సీనియర్ ఎమ్మెల్యే హరినారాయణ సింగ్. బీహార్లో ఇప్పటి వరకు హరి నారాయణతో పాటు సదానంద సింగ్ - రమేష్ రామ్ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిలో ఇద్దరు దివంగతలు అయ్యారు. ప్రస్తుతం హర్నౌత్ నియోజకవర్గం వహిస్తున్న హరి నారాయణ్‌ వచ్చే ఎన్నికల్లోను పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఆయన విజయం సాధిస్తే బీహార్లో పది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైకనాటిగా అరుదైన రికార్డు సాధిస్తారు.


దేశంలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో తొలి జాబితాలో ఉన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకె అధినేత దివంగత కరుణానిధి ఆయన ఎమ్మెల్యేగా 13 సార్లు విజయం సాధించారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన ఆయన 2018 వరకు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కేయం మున్సీ కేరళలో వరుసగా 13 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే పశ్చిమబెంగాల్ కు సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా పని చేసిన వామపక్ష నేత జ్యోతిబసు 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత దేశముఖ్‌ 11 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ 11 సార్లు ... రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి హరి దేవ్ జోషి పదిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: