చాలా మందికి కూడా గొంతు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది.బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల కారణంగా మనం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గొంతు బొంగురు పోవడం, మాట్లాడుతుంటే బాగా నొప్పిగా ఉండడం, టాన్సిల్స్ వచ్చి నొప్పిగా ఉండడం వంటి ఇతర ఇబ్బందులను కూడా మనం చాలా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం. ఇటువంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది కూడా యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు.వీటిని ఎక్కువగా వాడడం వల్ల ఈ సమస్య తగ్గు ముఖం పట్టి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. కానీ వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను మనం కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే పదార్థాలను వాడి కషాయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ లను తగ్గించే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి.తరువాత అందులో అర టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. తరువాత ఇందులో బ్లాక్ సాల్ట్ ను లేదా రాళ్ల ఉప్పును వేసి కలపాలి. ఈ నీటిని ఎక్కువ సేపు మరిగించకుండా గోరు వెచ్చగా అయ్యే దాకా వేడి చేయాలి. తరువాత ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. గొంతులో దురద, కఫం వంటి సమస్యలతో బాధపడే వారు ఇందులో తేనెను వేసి కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటలా గొంతులో పోసుకుని ఒక 5 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఈ గ్లాస్ మిశ్రమం అంతా అయిపోయే దాకా ఇలాగే చేయాలి. ఇలా పుక్కిలించిన తరువాత అర గంట దాకా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.ఈ టిప్ తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: