దుస్తుల విషయానికి వస్తే  మనం ఏమి వేసుకోవాలో ఏమి వేసుకోవద్దో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుత కాలంలో రంగురంగుల దుస్తులతో పాటు వేల డిజైన్లలో  వస్తున్నాయి. అది మహిళలకు అయితే  ఇంకా చెప్పనక్కరలేదు. ఎన్ని రకాల దుస్తులు ఉంటాయంటే వాటిని చెప్పడం చాలా కష్టం. రోజుకు ఒక డిజైన్ మార్కెట్ లోకి వస్తూ ఆకట్టుకుంటుంది. కానీ దుస్తుల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. పెళ్లైన వారు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి. వివాహం కాని వారు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ.మరి అది ఏంటో తెలుసుకుందామా..!

అయితే మనం బట్టలు అనేది పూర్వకాలం నుండి వాతావరణానికి అనుగుణంగా ఏవైతే బాగుంటాయో అవే దుస్తులు వాడుతూ వచ్చేవారు. ప్రస్తుత కాలంలో వస్త్రాల విషయానికి వచ్చినప్పుడు ఎవరి స్వతంత్రం వాడిదే. ప్రస్తుతం వారు ఎటువంటి దుస్తుల్లో స్కిన్ టైట్  పాయింట్ లెగ్గిన్స్ వాడడం వల్ల  కనీసం చర్మానికి గాలి తగిలే అవకాశం లేకుండా పోవడంతో, చాలామంది  చర్మ సమస్యల బారిన పడుతున్నారు. మన ఇండియాలో వాతావరణ పరిస్థితులు చూసుకుంటే మన చర్మానికి తప్పనిసరిగా గాలి తగిలే  అవసరం ఉంటుంది. కాబట్టి మనకు చలికాలం వస్తే వెచ్చని బట్టలు కావాలి. కానీ చాలామంది స్కిన్ టైట్ పాయింట్ లు వేసుకోవడం వలన ఆ చలిగాలిలో నేరుగా చర్మానికి తగిలితే చర్మం పాడయ్యే  అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ప్రస్తుత కాలంలో మనం మన ఆరోగ్యానికి సంబంధించిన బట్టలు వేసుకోకుండా సినిమాల్లో ఫ్యాషన్ ను బట్టి బట్టలు కూడా మారుతున్నారు. అది కూడా చిన్నపిల్లల నుంచి మొదలు పెద్దవాళ్ల వరకూ ఇదే తంతు నడుస్తోంది. ప్రస్తుత కాలంలో ఈ స్కిన్ టైట్ పాయింట్ లు వేసుకోవడం వల్ల ఒక్కోసారి ఈ పాయింటు చర్మం కలరు ఒకే విధంగా ఉండటం వల్ల దూరం నుంచి చూసిన వారికి వీరు బట్టలు వేసుకున్నారా లేదా అనే విధంగా కనిపించే పరిస్థితులు కూడా మనకు ఎదురవుతున్నాయి. ఎక్కువగా ఈ స్కిన్ టైట్ లెగ్గిన్స్ ను ఆడవాళ్ళు వేస్తున్నారు కాబట్టి కనీసం బయట గాలి కొద్దిగా కూడా చర్మానికి తగలకుండా ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఎలర్జీలు లాంటివి  బాగా వస్తున్నాయి. ముఖ్యంగా బట్టలు వేసుకునేటప్పుడు మనం వేసుకున్న బట్టలు బయట వారు  తప్పనిసరిగా చూస్తారు. మరి చూసిన వారికి మన మీద ఎలాంటి భావన కలుగుతుంది.

 అనే విషయాన్ని తప్పనిసరిగా ఆలోచించి మనం దుస్తులను వాడుకోవాలనేది ప్రధానాంశం. ముఖ్యంగా పెళ్లి కాకముందు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న ఆడవారు పెళ్లయిన తర్వాత కూడా ఇదే తంతును కొనసాగిస్తున్నారు. పూర్వకాలంలో పెళ్లైన స్త్రీలు తప్పకుండా చీరలు కట్టి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించేవారు. కానీ ఈ టెక్నాలజీ యుగంలో ఆ చీర అనేది మాత్రం ఒక పెళ్లి రోజు తప్ప ఏరోజు కనిపించడం లేదనేది జగమెరిగిన సత్యం. అయితే బట్టల విషయంలో ఎవరి ఇష్టం వారిది. కానీ శరీరానికి కంఫర్ట్ గా లేని బట్టలు ధరించి చర్మంను పాడు చేసుకోకూడదని  కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: