- ( ఇండియా హెరాల్డ్ - లైఫ్ స్టైల్ ) . . .

కొంతమంది రాత్రి వేళల్లో గదిలో లైట్ వేసుకుని పడుకుంటారు .. దీనివల్ల శరీరంలో జీవక్రియ పనితీరు  పై ప్రభావం చూపడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. గదిలో వెలుతురు ఉండటం వల్ల శరీరంలో నిద్రించడానికి తోడ్పడే హోర్మోన్ ఉత్పత్తి శాతం తగ్గుతుందట. దీనివల్ల గాఢ నిద్రలోకి జారిపోవడం సాధ్యం కాదని . .. ఫలితంగా ఒత్తిడి .. అలసట నుంచి శరీరానికి విశ్రాంతి లభించదని చెబుతున్నారు. లైట్ వేసుకుని పడుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పనితీరు మందగించి శరీరం నుంచి సరైన మోతాదు లో గ్లూకోస్ రాదని ఫలితంగా టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలో భారీగా హెచ్చుతగ్గులు ఉంటాయట. నిద్రించేటప్పుడు చుట్టూ వెలుతురు ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందట. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరిగి వారి గుండెచప్పుడు రావచ్చు అంటున్నారు.


లైట్ వెలుతురులో పడుకోవడం వల్ల నిరాశ మానసిక అశాంతి చిరాకు కోపం తలనొప్పి .. ఊబ‌కాయం లాంటి సమస్యలు వస్తాయట. అలాగే మెదడులో న్యూరోట్రాన్స్ మీటర్లు సమతుల్యతను కోల్పోతాయని భావోద్వేగాల నియంత్రణ సామర్థ్యం ఆలోచన సామ‌ర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రశాంతంగా నిద్రించాలన్న . . శరీరం పూర్తిగా విశ్రాంతి పొంగలి అన్న చీకటి గదిలో పడుకోవడం మంచిది అని చెబుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: