
అయితే బాదంపప్పు మార్కెట్లో దొరికేటివన్నీ ఒరిజినల్ కాదు . కొందరు ఫేక్ బాదంపప్పులు కూడా అమ్ముతూ ఉంటారు . మనం కొనే బాదంపప్పు ఒరిజినల్ నా..? లేకపోతే ఫేక్ నా..? అని తెలుసుకొని కొనుక్కోవడం చాలా చాలా మంచిది . ఒరిజినల్ బాదంపప్పు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ..కల్తీ బాదం పప్పు వల్ల అన్ని అనారోగ్య సమస్యలకి గురవుతారు . కాబట్టి మనం కొనుక్కునే ముందు బాదంపప్పు నిజమైనదా..? ఫేక్ దా..? అని తెలుసుకొని కొనుక్కోవడం మంచిది .
నిజమైన బాదంపప్పు - ఫేక్ బాదంపప్పు ఎలా గుర్తించడం..?
నిజమైన బాదంపప్పులు లేత గోధుమ రంగులో ఉంటాయి . కల్తీ బాదం పప్పులు ఎక్కువగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఇలా మనం ప్యాకెట్ చూసి చూడగానే చెప్పేయొచ్చు . ఇది రసాయనాల కలపడం వల్ల జరుగుతుంది . ముదురు రంగులో ఉన్న బాదం కనిపిస్తే వెంటనే దాన్ని దూరం పెట్టండి కొనకండి. బాదంపప్పులు లేత గోధుమ రంగులో ఉంటేనే కొనండి . బాదంపప్పులు నీటిలో వేస్తే నిజమైనవి నీళ్లలో మునిగిపోతాయి. ఎందుకంటే వాటికి బరువు సాంద్రత్త సరిగ్గా ఉంటుంది. అయితే కల్తీ బాదంపప్పులు నీటిలో వేస్తే అవి నీటిపై తేలిపోతాయి. అవి ఫేక్ బాదం పప్పులు అని అర్థం .ఇవి తక్కువ బరువు కలవి . అలాగే వాటిలో తక్కువ బరువు గల పదార్థాలు కలిపారని సంకేతం . బాదంపప్పులను చేతుల్లో పెట్టి వేళ్ళతో రుద్దాలి నిజమైన బాదంపప్పు రుద్దిన తర్వాత చేతిపై ఎలాంటి రంగు ఉండదు . కానీ నకిలీ బాదం పప్పు రంగు చెయ్యి మీద పడుతుంది. ఇలా ఒరిజినల్ బాదంపప్పు ఫేక్ బాదం పప్పులను కనుక్కొని మంచి బాదంపప్పు కొనుక్కొని తినడం ఆరోగ్యానికి మంచిది..!