
ఈ పండ్లు తినడం వల్ల కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమై, గ్లూకోజ్ రక్తంలో నిదానంగా విడుదల అవుతుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ హఠాత్ గా పెరగకుండా కంట్రోల్ లో ఉంటాయి. అంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ కారకంగా మారే కణాల నాశనాన్ని నిరోధిస్తుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం 10-15 పండ్లను నేరుగా తినవచ్చు. ఇవి తినే ముందు శుభ్రంగా కడిగి, గింజను తీసేసి తినాలి. నేరేడు పండ్ల గుజ్జును నలిపి, కొద్దిగా నీరు కలిపి తాగవచ్చు. తక్కువ మోతాదులో తాగాలి – రోజు ఒక గ్లాసు మాత్రమే సరిపోతుంది.
నేరేడు గింజలను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడిగా వుంచి గ్రైండ్ చేయాలి.ఈ పొడిని రోజుకు రెండు సార్లు, అర చెంచా తేనె లేదా నీటితో కలిపి తీసుకోవచ్చు. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. కొన్ని తాజా నేరేడు ఆకులను తీసుకొని నీటిలో వేపి, ఆ నీటిని మరిగించి వడకట్టాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకసారి తాగవచ్చు. ఇది డయాబెటిస్ నివారణకు సహకరిస్తుంది. మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే, బీపీ లేదా ఇతర సమస్యలు కలగొచ్చు. డయాబెటిస్ మందులు వాడుతున్న వారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. గర్భిణీలు, మదులైన మహిళలు నేరేడు గింజ పొడి వాడకపోవడం మంచిది.